News March 21, 2025

SRD: ‘విదేశీ విద్య పథకానికి దరఖాస్తుల ఆహ్వానం’

image

అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి అంబేడ్కర్ విద్యానిధి పథకం కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి గురువారం తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను http://telanganaepass.cgg.gov.inలో మే 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. SHARE IT..

Similar News

News December 22, 2025

ఈ నెల 24న వనపర్తిలో ‘మీ డబ్బు-మీ హక్కు’ శిబిరం

image

జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 24న ‘మీ డబ్బు-మీ హక్కు’ ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టరు ఆదర్శ్‌ సురభి తెలిపారు. వివిధ కారణాలతో క్లెయిమ్‌ చేసుకోని ఆర్థిక ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన మూడు నెలల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా జిల్లా స్థాయి శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ అన్‌క్లెయిమ్డ్ సొమ్మును తిరిగి పొందాలని ఆయన సూచించారు.

News December 22, 2025

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 22, 2025

USలో విద్యార్థినులకు పెరిగిన ‘డీప్‌ఫేక్’ బెడద

image

USలో స్కూళ్లలో డీప్‌ఫేక్ చిత్రాలు, వీడియోలతో వేధింపులు ఎక్కువయ్యాయి. విద్యార్థినుల ఫొటోలను అసభ్యంగా మార్చడం ఎంతోకాలంగా జరుగుతున్నా AI సాంకేతికతతో అది మరింత పెరిగింది. లూసియానా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. ఓ టీచర్‌పైనా అభియోగాలు వచ్చాయి. పిల్లల అసభ్య చిత్రాల కేసుల సంఖ్య 2023లో 4,700 కాగా 2025 మొదటి 6 నెలల్లోనే 440,000కి పెరిగినట్లు NCMEC నివేదిక పేర్కొంది.