News December 21, 2025
SRD: సర్పంచ్‌గా 2019లో కొడుకు.. 2025లో తల్లి!

కంగ్టి మండలంలోని ఎడ్లరెగడి తండాలో ఒకే కుటుంబం వరుసగా రెండోసారి సర్పంచ్ పదవిని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. 2019లో బలిరామ్ సర్పంచ్‌గా సేవలు అందించగా, తాజా (2025) ఎన్నికల్లో బలిరామ్ తల్లి లంబాడి ఇరికి బాయి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తమపై నమ్మకంతో గెలిపించిన తండా వాసులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
Similar News
News December 21, 2025
మంచిర్యాల: 3,700 కేసులు పరిష్కారం

మంచిర్యాల జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 9 లోక్ అదాలత్ బెంచ్‌లలో 3,700 కేసులు పరిష్కరించినట్లు జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ తెలిపారు. 15 సివిల్ ధావాలు, 5 వాహన పరిహారం, 3, 650, క్రిమినల్, 33 సైబర్ క్రైమ్, 75 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.
News December 21, 2025
బీజేపీకి భారీగా విరాళాలు

2024-25లో రాజకీయ పార్టీలకు ₹3,811 కోట్ల డొనేషన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 9 ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా ఇవి అందాయి. బీజేపీకి ఏకంగా ₹3,112 కోట్లు (82%) రావడం గమనార్హం. కాంగ్రెస్‌కు ₹299 కోట్లు(8%), ఇతర పార్టీలకు ₹400 కోట్లు (10%) వచ్చాయి. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలివ్వడాన్ని సుప్రీంకోర్టు గతేడాది రద్దు చేసిన విషయం తెలిసిందే. 2023-24లో ₹1,218 కోట్ల విరాళాలు వచ్చాయి.
News December 21, 2025
MHBD: ఈనెల 22 నుంచి నట్టల నివారణ మందు పంపిణీ

జీవాల్లో అధిక మాంస ఉత్పత్తి లక్ష్యంగా ఈనెల 22 నుంచి 31 వరకు అన్ని మండలాల్లో గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డా.కిరణ్ కుమార్ తెలిపారు. నట్టలనివారణ మందును తాగిపిస్తే జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, జీవాలు ఆరోగ్యంగాను, సకాలంలో అధిక బరువు తూగుతాయని తెలిపారు.


