News April 11, 2025
SRD: 08455 276155 నంబర్‌ను వినియోగించుకోండి: కలెక్టర్

ప్రభుత్వ పథకాలు అమలు కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08455 276155 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సమస్య కోసం పై నెంబర్‌కి ఫోన్ చేయాలని చెప్పారు. పనివేళలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News December 22, 2025
నైపుణ్య శిక్షణతో ఉచిత ఉపాధి: భద్రాద్రి కలెక్టర్

జిల్లా యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు LSC(Logistics Skill Council), Redington Foundation (COLTE) సహకారంతో స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్, జాబ్ గ్యారెంటీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. హైదరాబాద్‌లో లాజిస్టిక్స్ రంగంలో పూర్తిగా ఉచిత శిక్షణతో పాటు 100% ప్లేస్‌మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ఈనెల 24న కలెక్టరేట్లో హాజరు కావాలన్నారు.
News December 22, 2025
టిప్పే రూ.68,600 ఇచ్చేశాడు!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ, అభిరుచి ఉంటుంది. కొందరిలో అది కాస్త ఎక్కువ ఉంటుంది. బెంగళూరులో ఓ వ్యక్తి డెలివరీ బాయ్స్‌కు ఏడాదిలో ₹68,600, చెన్నై యూజర్ ₹59,505 టిప్స్ ఇచ్చినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వెల్లడించింది. ‘ముంబైకర్ ఏడాదిలో రెడ్ బుల్ షుగర్ ఫ్రీ కోసం ₹16.3L, నోయిడా వ్యక్తి బ్లూటూత్ స్పీకర్లు, SSDల కోసం ₹2.69L వెచ్చించారు. ఓ హైదరాబాదీ 3 ఐఫోన్స్ కోసం ₹4.3L ఖర్చు చేశారు’ అని తెలిపింది.
News December 22, 2025
ఏరో స్పేస్ రంగంలో విస్తృత అవకాశాలు: ప్రో. రాములు

తెలంగాణ విమానయాన తయారీ రంగంలో వృత్తి నైపుణ్యత పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని అమెరికాలోని బోయింగ్ విమాన తయారీ సంస్థ శాస్త్రవేత్త, పరిశోధన విభాగ అధిపతి ప్రో.మామిడాల రాములు పేర్కొన్నారు. ఏరో స్పేస్ రంగ నిపుణులకు వృత్తి, ఉపాధి కల్పన రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని CSTD డిజిటల్ క్లాస్‌రూమ్‌లో ముఖాముఖి చర్చలో రాములు పాల్గొన్నారు.


