News April 11, 2025

SRD: 08455 276155 నంబర్‌ను వినియోగించుకోండి: కలెక్టర్

image

ప్రభుత్వ పథకాలు అమలు కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08455 276155 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సమస్య కోసం పై నెంబర్‌కి ఫోన్ చేయాలని చెప్పారు. పనివేళలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News January 14, 2026

ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

image

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News January 14, 2026

నిష్క్రమిస్తోన్న ఈశాన్య రుతుపవనాలు

image

AP: ఈశాన్య రుతుపవనాలు 3 రోజుల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి నిష్క్రమించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గాలుల దిశలో మార్పుతో క్రమంగా వైదొలుగుతాయని పేర్కొంది. మరోవైపు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News January 14, 2026

కామారెడ్డి: పండుగ పూట భగ్గుమన్న చికెన్ ధరలు

image

సంక్రాంతి వేళ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పండుగ డిమాండ్‌కు తోడు కోళ్ల దాణా ధరలు పెరగడంతో విక్రయదారులు ధరలను సవరించారు. బుధవారం మార్కెట్‌లో స్కిన్‌లెస్‌ చికెన్ కిలో రూ.310 చేరగా.. లైవ్ కోడి కిలో రూ.200 చొప్పున విక్రయించారు. చికెన్ ధరలు సామాన్యుడికి భారంగా మారగా, మటన్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మార్కెట్‌లో కిలో మటన్ రూ.800 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.