News April 11, 2025
SRD: 08455 276155 నంబర్‌ను వినియోగించుకోండి: కలెక్టర్

ప్రభుత్వ పథకాలు అమలు కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08455 276155 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సమస్య కోసం పై నెంబర్‌కి ఫోన్ చేయాలని చెప్పారు. పనివేళలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News December 26, 2025
బంగ్లాదేశ్ అందరిదీ: తారిఖ్ రెహమాన్

రాజకీయం, మతాలతో సంబంధం లేని బంగ్లాదేశ్‌ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని BNP తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ అన్నారు. దేశ పౌరులు శాంతి కాంక్షించాలని కోరారు. ఇంటి నుంచి బయటికి వెళ్లినవారు సురక్షితంగా తిరిగి రాగల దేశాన్ని చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దేశం ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు సమానంగా చెందుతుందన్నారు. 17ఏళ్ల తర్వాత దేశంలో అడుగుపెట్టిన తారిఖ్ PM రేసులో ఉన్నారు.
News December 26, 2025
తిరుపతి: గతంలో BVSలు ఎక్కడ జరిగాయంటే..?

సంప్రదాయ విజ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడంతో సమకాలిన సమాజానికి జరిగే మేలును దేశానికి చాటి చెప్పే కార్యక్రమం భారతీయ విజ్ఞాన సమ్మేళనం(BVS). 2007లో భోపాల్‌లో ప్రారంభించారు. 2009లో ఇండోర్, 2012లో జలంధర్, 2015లో పనాజీ, 2017లో పుణే, 2023లో అహ్మదాబాద్‌లో జరిగాయి. తొలిసారి తిరుపతి వేదికగా ఇవాళ BVS నిర్వహించనున్నారు.
News December 26, 2025
యశ్ దయాల్ స్థానంలో ఉమేశ్ యాదవ్?

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB బౌలర్ యశ్ దయాల్ స్థానంలో IND సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను వచ్చే సీజన్‌లో జట్టులోకి తీసుకోనున్నట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. పోక్సో కేసు నమోదైన యశ్‌ను జట్టులో ఎలా కొనసాగిస్తారని RCBపై విమర్శలొస్తున్నాయి. తాజాగా అతని ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో ఉమేశ్‌ను తీసుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై RCB నుంచి అధికారిక ప్రకటన రాలేదు.


