News December 18, 2025

SRD: 21 ఏళ్లకే సర్పంచ్‌గా గెలుపు

image

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం అలీఖాన్ పల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గుగులోతు రోజా సమీప ప్రత్యర్థిపై 76 ఓట్లతో విజయం సాధించారు. 21 సంవత్సరాల రోజా ఇంటర్ దాకా చదివింది. రోజా విజయంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని సర్పంచ్ రోజా తెలిపారు.

Similar News

News December 20, 2025

SHAR: 24న ఉదయం 8.54 గంటలకు..

image

AP: మరో శాటిలైట్ ప్రయోగానికి SDSC SHAR సిద్ధమైంది. ఈనెల 24న 8.54amకు LVM3-M6 రాకెట్‌ ప్రయోగాన్ని జరిపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. USకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్‌–6‌ను నింగిలోకి పంపనున్నారు. ఈ నెల 15న, 21న ప్రయోగం చేయాలనుకున్నా సాంకేతిక కారణాలతో కుదరలేదు. అటు ఈ ప్రయోగాన్ని SHAR గ్యాలరీల నుంచి చూడాలనుకునే వారు <>ఆన్‌లైన్‌<<>>లో నమోదు చేసుకోవాలని ఇస్రో సూచించింది.

News December 20, 2025

10ఏళ్ల కిందటే మైనింగ్‌కు ప్రయత్నం.. అడ్డుకున్న ప్రజలు

image

తంబళ్లపల్లె సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ, సాదుకొండ, ఇనుము కొండల్లో మైనింగ్ ప్రయత్నాలు 10ఏళ్ల కిందటే మొదలయ్యాయి. అప్పట్లో నియోజకవర్గంలోని 6మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధర్నాలు చేపట్టారు. పార్టీలకతీతంగా నాయకులు, నేతలు ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. అధికారులు సహకరించడంతో ప్రజలు, నాయకుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తడంతో అప్పట్లో మైనింగ్ విరమించుకున్నారు.

News December 20, 2025

ధనుర్మాసం: ఐదోరోజు కీర్తన

image

మధురా నగరంలో, యమునా తీరంలో జన్మించిన కృష్ణుడు అద్భుత గుణాలు కలవాడు. గొల్ల కులాన్ని తన రాకతో ప్రకాశింపజేశాడు. యశోద గర్భానికి వెలుగునిచ్చిన ఆయనను మనం పవిత్రమైన మనసుతో శరణు వేడాలి. ఏ కోరికలు కోరక స్వామిని భక్తితో పూజించాలి. ఆయన కల్యాణ గుణాలను గానం చేయాలి. ఫలితంగా మన పాపాలు పోతాయి. రాబోవు దోషాలన్నీ అగ్నిలో పడిన దూదిలా భస్మమవుతాయి. సర్వపాప హరుడైన ఆ పరమాత్మ నామస్మరణను ఎప్పుడూ మరువకూడదు. <<-se>>#DHANURMASAM<<>>