News August 28, 2025

SRD: 31 వరకు DCEB ఫీజు చెల్లించుకోవాలి: డీఈవో

image

ఈనెల 31 వరకు DCEB ఫీజును చెల్లించుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల విద్యాదికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్, SO, ZP, GOVT, MODEL, KGBV అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలు 31 వరకు చెల్లించాలని పేర్కొన్నారు. ఫీజు కట్టిన తర్వాత రిసీప్ట్, ఫిగర్ స్టేట్మెంట్, స్కూల్ రికగ్నిషన్ కాపీ, కవరింగ్ లెటర్‌లను జిల్లా విద్యాధికారి ఆఫీసులో సమర్పించాలన్నారు.

Similar News

News August 28, 2025

మోమిన్పేటలో అత్యధికంగా 44.8 మిమీటర్ల వర్షపాతం

image

వికారాబాద్ జిల్లాలో బుధవారం కురిసిన వర్షపాతం వివరాలను జిల్లా వాతావరణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అత్యధికంగా మోమిన్‌పేట మండలంలో 44.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, కోట్‌పల్లి మండలంలో ఎలాంటి వర్షం కురవలేదని ఆయన పేర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News August 28, 2025

శ్రీకాకుళం: సావిత్రమ్మ నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళంలోని చిత్రంజన్ వీధికి చెందిన భారటం సావిత్రమ్మ (85) గురువారం ఉదయం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు విషయాన్ని తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.

News August 28, 2025

తిరుపతి: అంతరించిపోతున్న పక్షులపై స్టడీ

image

రేడియేషన్ కారణంగా చాలా వరకు పక్షులు అంతరించిపోతున్నాయన్న సంగతి పలు పరిశీలనల్లో వెల్లడైంది. వాటిపై అధ్యాయనం చేయడానికి తిరుపతి ఫారెస్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి ఐఐటీతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టి, పక్షుల పరిరక్షణకు దోహదపడాలనేది తమ లక్ష్యమని ఫారెస్ట్ డీఎఫ్వో వివేక్ తెలిపారు.