News March 27, 2025
SRD: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం MDK, SRD, SDPT డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News March 30, 2025
పీకల్లోతు కష్టాల్లో SRH

సన్‌రైజర్స్ వైజాగ్‌లో కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ రనౌట్ రూపంలో చేజేతులా వికెట్ సమర్పించుకోగా ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్లకు యత్నించి ఔటయ్యారు. ఒకే ఓవర్లో వారిద్దరి వికెట్లు కోల్పోవడం గమనార్హం.
News March 30, 2025
నితీశ్ కుమార్ రెడ్డి డక్ అవుట్

విశాఖ వేదికగా జరుగుతున్న ఢిల్లీ-SRH మ్యాచ్‌లో లోకల్ బాయ్ నితీశ్ కుమార్ రెడ్డి నిరాశ పర్చారు. రెండు వికెట్లు పడ్డ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్.. స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డక్ అవుట్ అయ్యారు.
News March 30, 2025
రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ ఎప్పుడంటే?

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. తాజా పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది.