News March 17, 2024
SRD: భారీ వర్షం.. పిడుగుపడి ఒకరి మృతి

కంగ్టి మండలం భీమ్రాలో ఆదివారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన శిరుగొండ (45) మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ‘పొలం పనుల్లో ఉండగా వర్షం పడింది. రేకుల షెడ్డు కింద తలదాచుకోగా ఒక్కసారిగా పిడుగు పడింది’ అని స్థానికులు PSకు సమాచారం ఇచ్చారు. కంగ్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
మెదక్ జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఇలా..

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 21 మండలాల్లో మొత్తం 492 గ్రామ పంచాయతీలు ఉండగా.. 223 మహిళలకు రిజర్వు చేశారు. కేటగిరీ వారీగా చూస్తే 100 శాతం ఎస్టీ జనాభాలో 29 మహిళలకు, 42 ఎస్టీ జనరల్‌కు, 10 ఎస్టీ మహిళలకు, 11 ఎస్టీ జనరల్, ఎస్సీ జనాభాలో 33 మహిళలకు, 44 ఎస్సీ జనరల్‌కు, 49 బీసీ మహిళలకు, 59 బీసీ జనరల్, 102 అన్ రిజర్వుడ్ మహిళలకు, 113 అన్ రిజర్వుడ్ చేశారు.
News November 23, 2025
ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా రాజేశ్వర్

తెలంగాణ ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్(టీఏసీసీయూ) రాష్ట్ర కార్యదర్శిగా మెదక్‌కు చెందిన కాముని రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వర్ గతంలో జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బి.రామణా రెడ్డి ఎన్నికయ్యారు.
News November 23, 2025
మెదక్: సత్యసాయి బాబాకు కలెక్టర్ నివాళులు

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్ నివాళులు అర్పించారు. సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి సేవలను కొనియాడారు. ఆయన చూపిన ప్రేమ, అహింస, సత్యం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, సత్య సాయి సేవ సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు శిరిగా ప్రభాకర్, సాయిబాబా, శంకర్ గౌడ్, ప్రసన్న కుమారి ఉన్నారు.


