News October 16, 2025
SRD: NMMSకు దరఖాస్తు గడువు పొడిగింపు

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.1000 చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
కర్నూలు సిద్ధం… వెల్‌కమ్ మోదీ జీ!

ప్రధాని మోదీకి కర్నూలు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న ఆయన ఉ.10.20కి ఓర్వకల్లుకు చేరుకుంటారు. అనంతరం ఎంఐ-17 హెలికాప్టర్‌లో వెళ్లి శ్రీశైల మల్లన్నను దర్శించుకుంటున్నారు. మ.2.20కి కర్నూలులో జరిగి ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని రూ.13,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మోదీకి <<18016530>>స్వాగతం<<>> పలుకుతూ కర్నూలులో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి.
News October 16, 2025
కృష్ణా: బీరు బాటిళ్ల స్కాన్‌పై మందుబాబుల ఆందోళన.!

కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సురక్ష యాప్’పై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా యాప్‌లో బీరు బాటిళ్లను స్కాన్ చేస్తే ‘ఇన్వ్యాలిడ్’ అని చూపించడం గమనార్హం. దీనిపై మద్యం తాగేవారు, దుకాణదారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లో సాంకేతిక లోపం ఉందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
News October 16, 2025
విశాఖ: దీపావళి వేళ భద్రత కట్టుదిట్టం

దీపావళి పండుగ సమీపిస్తుండటంతో రైళ్లలో క్రాకర్లు తీసుకెళ్లకుండా నిరోధించడానికి వాల్తేర్ డివిజన్ అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణానికి డివిజన్ పరిధిలోని స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కఠినమైన నిఘా ఉంచుతూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను భద్రతా సిబ్బందికి తెలపాలని కోరారు.