News April 5, 2025
SRD: RYV సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

రాజీవ్ యువ వికాసం పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. సంగారెడ్డిలో యువ వికాసం పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ పాల్గొన్నారు.
Similar News
News February 26, 2026
FLNAT పరీక్షకు హాజరుకావాలి: కలెక్టర్

విశాఖలో ఫిబ్రవరి 28న వయోజన విద్యార్థులకు ప్రీ-ఫైనల్ FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉల్లాస్, అక్షరాంధ్ర పథకాల కింద 15 ఏళ్లు పైబడిన వారికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 26, 2026
పనితీరు ఆధారంగానే టీచర్లకు ప్రమోషన్లు.. విద్యా కమిషన్ ప్రతిపాదన

TG: టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులు రద్దు చేసి, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ కీలక సూచనలు చేసింది. ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేయడం తప్పనిసరి చేయాలని, రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధనలు మార్చాలంది. ఈ నిబంధన ఇకపై నియమించే ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదికను CM రేవంత్ రెడ్డికి అందజేసింది.
News February 26, 2026
అంకురార్పణతో మొదలైన రంగడి బ్రహ్మోత్సవాలు

నెల్లూరులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీతల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంకురార్పణతో మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు 26 నుంచి 8 వరకు జరగనున్నాయి. ఆలయ అర్చకులు అంకురార్పణలో భాగంగా పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, మృత్ సంగ్రహణ, ఉత్సవమూర్తులకు రక్షాబంధన్, సోమ కుంభ ప్రతిష్ఠ, గరుడ ధ్వజ ప్రతిష్ఠ, అంకురార్పణ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు.


