News April 5, 2025
SRD: అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్ క్రాంతి

సన్న బియ్యం పంపిణీలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన బియ్యం అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Similar News
News April 5, 2025
ఉమ్మడి జిల్లాల నేతలతో KCR సమావేశం

TG: ఇటీవల పలు జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న BRS చీఫ్ కేసీఆర్ తాజాగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నిర్వహణలపై వారితో చర్చిస్తున్నారు. సభ నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలను తరలించడం సహా పలు అంశాలపై నేతలతో మాజీ సీఎం సమాలోచనలు చేస్తున్నారు.
News April 5, 2025
అశ్లీల వీడియోలు చూసి షేర్ చేస్తున్నారా?

అశ్లీల వీడియోలను చూడటం, షేర్ చేయడం నేరమని TG పోలీసులు హెచ్చరించారు. యువత పోర్నోగ్రఫీకి దూరంగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ చూడొద్దని సూచించారు. సోషల్ మీడియాను మంచికోసం వాడుకోవాలని, అశ్లీల వీడియోలను పోస్ట్ & షేర్ చేసేవారిపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు బాలల అశ్లీల సన్నివేశాలను పంపినందుకు అరెస్ట్ అయినట్లు తెలిపారు.
News April 5, 2025
అల్లు అర్జున్ సినిమాలో క్రేజీ హీరోయిన్?

‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్ లేదా అట్లీ దర్శకత్వంలో ఆయన నటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. AAతో అట్లీ తెరకెక్కించే సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తారని సినీ వర్గాల్లో టాక్. ఇప్పటికే ఈ బ్యూటీ SSMB29లో నటిస్తున్నారు. ఈ క్రమంలో AA సినిమాలోనూ నటిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.