News April 7, 2025

SRD: పది మూల్యాంకనానికి ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

image

రామచంద్రపురం మండలంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో రేపటి నిర్వహించే పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. 1222 మంది ఉపాధ్యాయులను నియమించామని, మూల్యాంకన కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Similar News

News April 17, 2025

MBNR: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుదాం: ఫైర్ స్టేషన్ ఆఫీసర్

image

వేసవికాలంలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని మహబూబ్‌నగర్ అగ్నిమాపక శాఖ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మల్లికార్జున్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గృహాలు, హాస్పిటల్స్, పాఠశాలలు, కర్మాగారాల్లో ప్రమాదాలు, వరదలు, రోడ్డు, రైలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖ నంబర్ 101కు సమాచారం అందించాలన్నారు.

News April 17, 2025

రోగికి ఆధార్ తప్పనిసరి : ఆదిలాబాద్ DMHO

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తప్పకుండా ఆధార్ కార్డును తీసుకొని వెళ్లాలని ఆదిలాబాద్ DMHO డా.నరేందర్ రాథోడ్ సూచించారు. తద్వారా వ్యాధిగ్రస్థుల సమాచారం అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తామన్నారు. భవిష్యత్తులో రోగికి అందించిన సేవల వివరాలు తెలుసుకోవడానికి సహాయకారిగా ఉంటుందన్నారు. దీని ద్వారా చికిత్సలు అందించడానికి సులువవుతుందన్నారు. ఆరోగ్య, ప్రాథమిక కేంద్రాలకు ఆధార్ తీసుకు వెళ్లాలన్నారు.

News April 17, 2025

వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు..$700Mలతో బిగ్ డీల్!

image

భారత్, వియత్నాం మధ్య బ్రహ్మోస్ క్షిపణుల డీల్ తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. 700 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను ఆ దేశానికి సరఫరా చేసేలా భారత్ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. చైనాతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వియత్నాం ఈ క్షిపణులను కొనుగోలు చేసుకుంటుంది. కాగా 2022లో తొలిసారిగా 375 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు భారత్ అందించింది.

error: Content is protected !!