News December 21, 2024
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది: కిమ్స్

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వివరించింది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు బులిటెన్‌లో వెల్లడించారు. అటు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.
Similar News
News January 9, 2026
‘జన నాయకుడు’కు మరో చిక్కు.. డివిజన్ బెంచ్‌కు సెన్సార్ బోర్డు

విజయ్ దళపతి ‘జన నాయకుడు’ సినిమాకు మరో చిక్కొచ్చి పడింది. U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ <<18806328>>తీర్పును<<>> సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. తీర్పును పునర్పరిశీలించాలంటూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
News January 9, 2026
చరిత్ర సృష్టించిన రుతురాజ్

లిస్టు-A క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక బ్యాటింగ్ యావరేజ్(58.83) నమోదుచేసిన ఆటగాడిగా నిలిచారు. ఇతను 99 మ్యాచ్‌లలో 5,060 రన్స్ చేశారు. ఇందులో 20 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బెవాన్(57.86), హెయిన్(57.76), కోహ్లీ(57.67) ఉన్నారు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో అతి తక్కువ(59) మ్యాచుల్లో 15 శతకాలు బాదిన ప్లేయర్‌గా రుతురాజ్ రికార్డుల్లోకెక్కారు.
News January 9, 2026
HYD-VJA హైవేపై ప్రయాణిస్తున్నారా?

హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్గంలోని టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ గేట్ వద్ద శాటిలైట్ ద్వారా టోల్ ఫీజు వసూల్ కోసం హైవే అధికారులు ట్రయల్ నిర్వహించారు. పూర్తి స్థాయిలో శాటిలైట్ విధానం అమల్లోకి వస్తే ఈ రూట్లో పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ట్రాఫిక్ రద్దీ, జామ్ సమస్యలు తీరే అవకాశం ఉంది.


