News October 4, 2024

శ్రీవిష్ణు ‘స్వాగ్’ మూవీ రివ్యూ& రేటింగ్

image

పురుషాధిక్యం, లింగ సమానత్వానికి సంబంధించిన కథాంశంతో శ్రీవిష్ణు హీరోగా ‘స్వాగ్’ మూవీ రూపొందింది. రాజరాజ చోర ఫేమ్ హసిత్ గోలీ తెరకెక్కించిన ఈ సినిమాలో కామెడీ సీక్వెన్స్ బాగున్నాయి. 4 విభిన్న పాత్రల్లో హీరో యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. రీతూవర్మ, మీరాజాస్మిన్, సునీల్ తమ పరిధి మేరకు బాగా నటించారు. గందరగోళంగా ఉన్న ఫస్టాఫ్, క్లైమాక్స్, స్క్రీన్‌ప్లే మైనస్.
*రేటింగ్: 2.25/5

Similar News

News October 8, 2024

ఇరాన్ అణు ప‌రీక్ష‌లు జ‌రిపిందా..?

image

త‌ర‌చూ భూకంపాలు ఎదుర్కొనే ఇరాన్‌లో అక్టోబ‌ర్ 5న వ‌చ్చిన భూప్ర‌కంప‌న‌లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ వంద‌ల సంఖ్య‌లో బాలిస్టిక్ క్షిప‌ణ‌లు ప్ర‌యోగించిన కొన్ని రోజుల త‌రువాత ఈ ప్ర‌కంప‌నలు రావ‌డంతో ఇరాన్ అణు ప‌రీక్ష‌లు జ‌రిపింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. సెమ్నాన్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదవ్వ‌డంతో అణు ప‌రీక్ష‌ల‌పై పలువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

News October 8, 2024

రేపు HYDకు సమంత.. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తారా?

image

మంత్రి కొండా సురేఖ ఆరోపణల తర్వాత తొలిసారి హీరోయిన్ సమంత రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఆలియా భట్ నటించిన ‘జిగ్రా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆమె హాజరుకానున్నారు. దీంతో సమంత ఈ విషయంపై ఏమైనా మాట్లాడతారా? అనేదానిపై చర్చ మొదలైంది. మీడియా ఈ విషయంపై ప్రస్తావిస్తే ఆమె స్పందిస్తారా? లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. సమంతతో పాటు రానా, త్రివిక్రమ్ కూడా ఈవెంట్‌లో పాల్గొననున్నారు.

News October 8, 2024

మనుషులతో కాదు.. రోబోలతో శృంగారానికి ప్రాధాన్యత!

image

భవిష్యత్‌లో మహిళలు రోబోలతో ప్రేమలో పడతారని, శృంగారం విషయంలో పురుషుల కంటే వాటినే ఎక్కువగా ఇష్టపడతారని ఫ్యూచరాలజిస్ట్ డా.పియర్సన్ తెలిపారు. 2030నాటికి వర్చువల్ రియాలిటీ శృంగారం సర్వసాధారణమైపోతుందని, 2035 నాటికి శృంగార సంబంధిత పరికరాలు దీనితో లింక్ అవుతాయన్నారు. 2050 నాటికి రోబోట్ శృంగారం కామన్‌గా మారుతుందని అంచనా వేశారు. ఒకవేళ నిజమైన రిలేషన్‌షిప్స్‌‌ ఉంటే వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్నారు.