News March 25, 2026

SRHకు కావ్య, RCBకి అనన్య

image

IPLలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రత్యేక ఆకర్షణగా మారగా ఇప్పుడు ఆమెకు పోటీగా మరొకరు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా కన్సార్షియం రూ.16,725 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఫ్రాంచైజీ ఛైర్మన్ ఆర్యమాన్ బిర్లా సోదరి అనన్య బిర్లా యాక్టివ్‌గా మారి, మ్యాచులు చూసేందుకు వస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

Similar News

News April 5, 2026

రత్నమైనా, పద్యమైనా.. విలువ దేనికంటే?

image

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: శ్రేష్ఠమైన నీలి రంగు రత్నం ఒక్కటి ఉన్నా చాలు. దానికి ఎంతో విలువ ఉంటుంది. తళతళ మెరిసే రాళ్లు తట్టెడు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే రసవంతమైన, అర్థవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. వేల సంఖ్యలో అర్థం లేని పద్యాలతో మంచి జరగదు.<<-se>>#PADHYAM<<>>

News April 5, 2026

TG EAPCETకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే

image

తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల (లేట్ ఫీజు లేకుండా) గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 53.34% మంది అమ్మాయిలు, 46.66% మంది అబ్బాయిలు ఉన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమింగ్‌కు 2,03,167 అప్లికేషన్లు వచ్చాయి. నేటి నుంచి ఈ నెల 10 వరకు రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు EAPCET <>వెబ్‌సైట్<<>> చూడండి.

News April 5, 2026

బ్రష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దంతాల ఆరోగ్యం కోసం రోజూ రెండు సార్లు బ్రష్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ వాడాలి. గట్టిగా ఉండేవి వాడితే దంతాలపై ఎనామెల్ పొరను అరిగిపోయేలా చేస్తాయి. కనీసం 2min నోటిలోని అన్ని వైపులా తోమాలి. నాలుకను క్లీన్ చేసుకోవాలి. తిన్న తర్వాత బ్రష్ చేయాలనుకుంటే వెంటనే చేయవద్దు. 30-60min తర్వాతే చేయాలి. 3 నెలలకోసారి బ్రష్‌ను మార్చాలి’ అని సూచిస్తున్నారు.