News April 4, 2025

SRH బౌలింగ్ బాగానే ఉంది: కమిన్స్

image

KKRతో మ్యాచ్ ఓడిపోవడంపై SRH కెప్టెన్ కమిన్స్ స్పందించారు. బౌలింగ్ బాగానే ఉందని, కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడం వల్లే ఓడాల్సి వచ్చిందన్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా లేదని భావించి జంపాను ఆడించలేదని తెలిపారు. స్పిన్నర్లు బంతిని సరిగా గ్రిప్ చేయలేకపోయారని, అందుకే వాళ్లతో 3 ఓవర్లే వేయించినట్లు వివరించారు. మరోవైపు, స్పిన్నర్లను సరిగా ఉపయోగించకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి.

Similar News

News September 12, 2025

ఎయిర్‌టెల్ డౌన్.. కస్టమర్ల ఫైర్

image

ఎయిర్‌టెల్ కస్టమర్లు నెట్‌వర్క్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజులుగా సరిగా సిగ్నల్స్ రావడం లేదని వాపోతున్నారు. మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నెట్ కూడా పనిచేయడం లేదంటున్నారు. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. SMలో తమ అసంతృప్తిని తెలియజేస్తూ ‘#AirtelDown, #BanAirtel’ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. మీకూ నెట్‌వర్క్ సమస్య ఎదురవుతోందా?

News September 12, 2025

బజరంగ్‌ పునియా తండ్రి కన్నుమూత

image

భారత రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత బజరంగ్‌ పునియా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి బల్వాన్ పునియా ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో గత 18 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు తన తండ్రి చాలా కష్టపడ్డారని, కుటుంబానికి ఆయనే వెన్నెముక అని బజరంగ్‌ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

News September 12, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

రాబోయే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇవాళ ప.గో, ఏలూరు, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, NLR, KNL, నంద్యాల, ATP, కడప, TPT జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. అటు TGలో NML, NZB, HYD, మేడ్చల్, MBNR, NGKL, NRPT, వనపర్తి, మహబూబాబాద్, SRPT, JGL, SRCL, వికారాబాద్, కామారెడ్డి, గద్వాల్, NLG జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.