News February 17, 2025

ఉప్పల్‌లో 9 మ్యాచులు ఉన్నా SRH ఫ్యాన్స్‌కు నిరాశే..

image

IPL 2025 షెడ్యూల్ ప్రకారం ఉప్పల్ వేదికగా 9 మ్యాచులు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే HYDలో లీగ్ దశలో ఆర్సీబీ, సీఎస్కేతో ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం SRH అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ టీమ్స్‌లోనే ధోనీ, కోహ్లీ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. అయితే MIతో ఏప్రిల్ 23న మ్యాచ్ ఉండటం కాస్త ఊరటనిస్తోంది. మరి ఉప్పల్ వేదికగా జరిగే క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆ జట్లతో తలపడుతుందేమో చూడాలి.

Similar News

News September 18, 2025

శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.

News September 18, 2025

ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 35 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9

image

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>