News April 25, 2024
పీకల్లోతు కష్టాల్లో SRH

RCBతో మ్యాచులో భారీ అంచనాలు పెట్టుకున్న SRH తడబడుతోంది. 207 టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 85కే 6 కీలక వికెట్లు కోల్పోయింది. హెడ్(2), మార్క్రమ్(7), క్లాసెన్(7) ఘోరంగా విఫలమయ్యారు. నితీష్ రెడ్డి 13, సమద్ 10 పరుగులకే ఔట్ అయ్యారు. అభిషేక్ ఒక్కడే 31 రన్స్‌తో రాణించారు. RCB బౌలర్లలో స్వప్నిల్, కర్ణ్ శర్మ చెరో 2 వికెట్లు తీశారు.
Similar News
News January 14, 2026
మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి: ట్రంప్

తమ నేషనల్ సెక్యూరిటీ కోసం గ్రీన్‌ల్యాండ్ అవసరం అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తాము అమెరికాలో చేరబోమని, డెన్మార్క్‌లోనే ఉంటామని గ్రీన్‌ల్యాండ్ ప్రధాని ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ‘గ్రీన్‌ల్యాండ్ అమెరికా చేతుల్లో ఉండటం వల్ల నాటో మరింత స్ట్రాంగ్ అవుతుంది. మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి. అది జరగనివ్వను’ అని పోస్ట్ చేశారు.
News January 14, 2026
-40 మార్కులు వస్తే డాక్టరా?.. ఆందోళన!

నీట్ పీజీ-2025లో రిజర్వ్‌డ్(SC,ST,BC) కేటగిరీలో <<18852584>>కటాఫ్<<>> తగ్గింపుపై డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -40 మార్కులు వచ్చినా క్వాలిఫై అయినప్పుడు ఎగ్జామ్ ఎందుకని ప్రశ్నలు లేవనెత్తింది. కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ట్రైనింగ్, ప్రాక్టీస్, సర్జరీల్లో పాల్గొనే అవకాశం కల్పించేలా ఉన్న ఈ నిర్ణయం బాధాకరమని తెలిపింది. కటాఫ్ తగ్గింపుపై పునరాలోచన చేయాలని, ఇది వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతోంది.
News January 14, 2026
సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు కచ్చితంగా ఉండాలా?

ఇంటి సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండటం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇది ఇంటికి అందంతో పాటు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చేస్తుందంటున్నారు. ‘మిగిలిన 3 దిక్కులలో ఒక్కో ద్వారం ఉంటే సరిపోతుంది. పెద్ద ఇళ్లకు 4 వైపులా ద్వారాలు ఉండటం ఉత్తమం. మారుతున్న చిన్న కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా కిటికీలు ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


