News May 26, 2024
కష్టాల్లో SRH

KKRతో ఫైనల్లో SRH 7 ఓవర్లలో 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. తొలి ఓవర్‌లో అభిషేక్, రెండో ఓవర్‌లో హెడ్ వికెట్లను కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న త్రిపాఠి కూడా 9 రన్స్‌కే పెవిలియన్ చేశారు. మార్క్రమ్, నితీశ్ కొద్దిసేపు దూకుడుగా ఆడారు. అంతలోనే నితీశ్(13) కూడా ఔటయ్యారు. KKR బౌలర్లు స్టార్క్ 2, వైభవ్, హర్షిత్ తలో వికెట్ తీశారు.
Similar News
News October 29, 2025
ఎల్లుండి నుంచి ఓటీటీలోకి 2 సినిమాలు

బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన కాంతార ఛాప్టర్-1, కొత్త లోక ఎల్లుండి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ‘కాంతార ఛాప్టర్-1’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, ‘కొత్త లోక’ జియో హాట్ స్టార్‌లో అందుబాటులోకి రానున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ‘కాంతార ఛాప్టర్-1’ రూ.800 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కొత్త లోక’ రూ.300కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
News October 29, 2025
NVIDIA సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి కంపెనీ

అమెరికన్ టెక్ కంపెనీ NVIDIA సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి కంపెనీగా రికార్డుల్లోకి ఎక్కింది. $4 ట్రిలియన్ వాల్యూను చేరుకున్న 3 నెలల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. $500B విలువైన AI చిప్ ఆర్డర్లు వచ్చాయని, US ప్రభుత్వం కోసం 7 సూపర్ కంప్యూటర్లు నిర్మిస్తున్నామని కంపెనీ CEO జెన్సెన్ హువాంగ్ చేసిన ప్రకటనతో షేర్లు భారీగా ఎగిశాయి.
News October 29, 2025
రూ.303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని ఆదేశం

TG: పెండింగ్‌లో ఉన్న SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలన్నారు. దీనివల్ల ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందుతుందని, వారి మానసిక ఒత్తిడి తగ్గుతుందని భట్టి పేర్కొన్నారు.


