News March 27, 2025
SRH మ్యాచ్.. వార్నర్ ఆసక్తికర ట్వీట్

నేడు ఉప్పల్ వేదికగా SRH, LSG మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ సన్ రైజర్స్ 300 పరుగులు చేస్తుందా? అని Xలో ప్రశ్నించారు. ఈ మ్యాచ్ చూసేందుకు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అభిషేక్ శర్మ 100, హెడ్ 20 బంతుల్లో 50 పరుగులు చేస్తారని అంచనా వేశారు. కాగా గతంలో SRH సారథిగా వ్యవహరించిన వార్నర్ ఆ జట్టుకు ట్రోఫీ అందించారు.
Similar News
News March 30, 2025
66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మ!

10మంది పిల్లలకు జన్మనివ్వడమంటేనే కష్టం. ఆ పదో బిడ్డను 66ఏళ్ల వయసులో ప్రసవిస్తే..? జర్మనీకి చెందిన ఆలెగ్జాండ్రా హెల్డెబ్రాండ్ ఇదే ఘనత సాధించారు. ఎటువంటి కృత్రిమ పద్ధతులూ లేకుండా ఆమె సహజంగానే తల్లి కావడం, ప్రసవించడం విశేషం. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారని బెర్లిన్‌లోని చారైట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అలెగ్జాండ్రా తొలి బిడ్డకు ఇప్పుడు 50 ఏళ్లు కావడం ఆసక్తికరం.
News March 30, 2025
కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు. రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని చెప్పి ఫామ్ హౌస్‌లో ఎకరాల కొద్దీ పండించారని అన్నారు. రూ.4,500కు క్వింటా చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. మూడేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే.. మూడేళ్లలోనే కూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కావాలనే శ్రీశైలం ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు.
News March 30, 2025
అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చా: పవన్

AP: కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే తాను చంద్రబాబుకు మద్దతిచ్చానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పీ-4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొన్నారు. ‘సాధారణ నాయకుడు రాజకీయాలు, ఎన్నికల గురించే ఆలోచిస్తాడు. చంద్రబాబు లాంటి విజనరీ నేత వచ్చే తరం గురించి ఆలోచిస్తారు. పీ-4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయి. తెలుగు ప్రజలు బాగుండాలనేదే చంద్రబాబు, నా ఆకాంక్ష’ అని తెలిపారు.