News April 12, 2025

దంచికొడుతున్న SRH ఓపెనర్లు

image

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో SRH ఓపెనర్లు దంచికొడుతున్నారు. అభిషేక్ శర్మ (87*), ట్రావిస్ హెడ్ (49*) ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నారు. అభిషేక్‌కు ఓ లైఫ్ రావడంతో రెచ్చిపోయి ఆడుతున్నారు. వీరిద్దరి ధాటికి SRH 10 ఓవర్లకు 143/0 పరుగులు చేసింది. SRH విజయానికి మరో 10 ఓవర్లలో 103 రన్స్ అవసరం. మరి ఎన్ని ఓవర్లలో హైదరాబాద్ టార్గెట్ ఛేజ్ చేస్తుందో కామెంట్ చేయండి.

Similar News

News April 13, 2025

గవర్నర్ ఆమోదం లేకుండానే బిల్లులకు చట్ట హోదా..దేశంలోనే తొలిసారి

image

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ అనుమతి లేకుండానే 10బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో గవర్నర్ ప్రమేయం లేకుండానే బిల్లులకు చట్ట హోదా కల్పించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపే బిల్లులను నెలలోగా అనుమతించకపోతే అది చట్టరూపం దాల్చినట్లు భావించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

News April 13, 2025

అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రూల్స్!

image

అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రూల్స్ అమలయ్యే అవకాశముంది. వన్డేల్లో పదేళ్ల నుంచి అమల్లో ఉన్న 2 కొత్త బంతుల విధానాన్ని మార్చాలని గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ ఐసీసీకి ప్రతిపాదించింది. ఒకప్పటిలా ఒకే బంతి వాడితే పాతబడ్డాక రివర్స్ స్వింగ్, స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. WTCలో భారీ తేడాతో గెలిస్తే, పెద్ద జట్లను చిన్నవి ఓడిస్తే అదనపు పాయింట్లు ఇవ్వాలంది. త్వరలో ICC తుది నిర్ణయం తీసుకోనుంది.

News April 13, 2025

తెలుగు విద్యార్థికి 300కు 300 మార్కులు?

image

ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన JEE మెయిన్ తుది విడత పరీక్షల <>ప్రైమరీ కీ<<>> విడుదలైంది. ఏవైనా అభ్యంతరాలుంటే ఇవాళ రాత్రి 11.50 గంటల్లోపు ఆన్‌లైన్ ద్వారా పంపొచ్చు. పరిశీలన అనంతరం ఫైనల్ కీని రిలీజ్ చేస్తారు. ప్రాథమిక కీ ప్రకారం HYDలో చదువుతున్న అజయ్‌రెడ్డి 300కు 300 మార్కులు సాధించినట్లు సమాచారం. JANలో జరిగిన తొలి విడత ఎగ్జామ్‌లో ఇతను 99.966 పర్సంటైల్ స్కోర్ పొందాడు. అజయ్ సొంతూరు ఏపీలోని నంద్యాల(D) తాటిపాడు.

error: Content is protected !!