News December 31, 2024
SRH ప్లేయర్ విధ్వంసం

విజయ్ హజారే ట్రోఫీలో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించారు. పంజాబ్ తరఫున ఆడుతున్న అతను సౌరాష్ట్రపై 60 బంతుల్లోనే సెంచరీ చేశారు. మొత్తంగా 96 బంతుల్లో 170 రన్స్ బాదేశారు. ఇందులో 22 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మరో ప్లేయర్ ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా 95 బంతుల్లోనే 125 పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు 50 ఓవర్లలో 424/5 స్కోర్ చేసింది. అభిషేక్ ఐపీఎల్లో SRH తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
Similar News
News December 9, 2025
శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.
News December 9, 2025
మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే!

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇలా కాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. హెల్తీ ఫుడ్, తగినంత నిద్ర, మంచినీళ్లు తాగడం, సంతోషంగా ఉండటం వల్ల సహజంగా అందం పెరుగుతుందంటున్నారు. దీంతో పాటు బేసిక్ స్కిన్ కేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ వాడాలని చెబుతున్నారు.
News December 9, 2025
ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<


