News April 7, 2025

ఆస్పత్రిలో SRH ప్లేయర్

image

నిన్న GTతో మ్యాచులో SRH హర్షల్ పటేల్‌ను తీసుకుంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. దానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో పేసర్ ఉనద్కత్‌ను జట్టులోకి తీసుకున్నారు. నిన్న స్లో పిచ్‌పై హర్షల్ కీ బౌలర్ అయ్యేవారని, ఆయన లేకపోవడం SRHను దెబ్బతీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News April 9, 2025

వక్ఫ్ చట్టం అమలు చేసేది లేదు: మమతా బెనర్జీ

image

వక్ఫ్ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులకు ఎటువంటి ప్రమాదం ఉండదని ముస్లిం ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మతం పేరిట విభజన రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే తాను అన్ని మతాల కార్యక్రమాలకు హాజరవుతానన్నారు. తనను కాల్చి చంపినా సమైక్యత నుంచి వేరు చేయలేరని తేల్చిచెప్పారు.

News April 9, 2025

ట్రంప్ టారిఫ్స్‌పై మోదీ మౌనం ఎందుకు?: రాహుల్

image

US టారిఫ్స్‌తో భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ట్రంప్ టారిఫ్స్ విధిస్తుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. “ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారు. అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారు. RSS, BJP రెండూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. క్రైస్తవుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని RSS పత్రిక ‘ఆర్గనైజర్’లో రాస్తున్నారు” అని పేర్కొన్నారు.

News April 9, 2025

సచిన్ తర్వాత మరో అద్భుతం ప్రియాంశ్: సిద్ధూ

image

CSKపై సంచలన ఇన్నింగ్స్ ఆడిన PBKS బ్యాటర్ ప్రియాంశ్ ఆర్యపై మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసలు కురిపించారు. ‘సచిన్ తర్వాత మరో అద్భుతాన్ని ఇప్పుడే చూస్తున్నా. CSK బౌలర్లను ఊచకోత కోయడం అమోఘం. ఇండియాకు సుదీర్ఘకాలం ఆడే సత్తా ప్రియాంశ్‌కు ఉంది. ఓడిపోతుందనుకున్న పంజాబ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొని ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం సాధారణ విషయం కాదు’ అని ఆయన కొనియాడారు.

error: Content is protected !!