News October 16, 2024
కమిన్స్‌ను SRH వదిలేస్తుంది: ఆకాశ్ చోప్రా

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పారు. అతడిపై రూ.18 కోట్లు వెచ్చించేందుకు ఆ జట్టు సిద్ధంగా లేదని చెప్పారు. ‘కమిన్స్‌తోపాటు మార్క్‌రమ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్‌ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Similar News
News February 2, 2026
పశ్చిమ గోదావరికి బడ్జెట్ బూస్ట్

కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి పశ్చిమ గోదావరికి పలు కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్టుకు రూ.3,200 కోట్ల సాయం, జిల్లా ఆసుపత్రుల్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు నిధులు దక్కాయి. కోకో, కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏలూరు, భీమవరంలో బాలికల హాస్టళ్లు, నరసాపురం క్రోచెట్ లేస్ తయారు చేసే మహిళల కోసం ‘షి’ మార్కెట్లు రానున్నాయి.
News February 2, 2026
173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 2, 2026
మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లివే..

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


