News May 8, 2024

SRH vs లక్నో మ్యాచ్.. వర్షంపై UPDATE

image

ఇవాళ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్-లక్నో మధ్య జరిగే మ్యాచుకు వర్షం అంతరాయం కల్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షం పడే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని, స్వల్ప అంతరాయం తప్ప మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశమే లేదని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల వాతావరణం చల్లగా ఉంటుందని చెప్పారు.

Similar News

News January 26, 2026

మంచు మనోజ్ భయంకరమైన లుక్

image

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భయంకరమైన లుక్‌లో దర్శనమిచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నాలోని సరికొత్త కోణం. క్రూరమైన, క్షమించలేని’ అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాకు హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ విడుదల కానుంది.

News January 26, 2026

యాసిడ్ దాడి నుంచి పద్మశ్రీ వరకూ!

image

కేంద్రం ప్రకటించిన ‘పద్మశ్రీ’ అవార్డుల జాబితాలో యాసిడ్ దాడి బాధితురాలు ప్రొఫెసర్ మంగళ కపూర్(UP) కూడా ఉన్నారు. 12 ఏళ్లకే యాసిడ్ దాడికి గురై 37 సర్జరీలు చేయించుకున్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. సంగీతాన్నే శ్వాసగా మార్చుకుని PhD సాధించి 3 దశాబ్దాలుగా విద్యాబోధన చేస్తున్నారు. గ్వాలియర్ ఘరానా శాస్త్రీయ సంగీతంలో ఆమె చేసిన కృషి అద్వితీయం. గాయాల నుంచి గెలుపు వైపు సాగిన ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.

News January 26, 2026

పనిమనిషిపై పదేళ్లుగా రేప్.. ధురంధర్ నటుడి అరెస్ట్

image

బాలీవుడ్ యాక్టర్ నదీమ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై 10సం.లుగా రేప్‌కు పాల్పడ్డారని అతడి ఇంటి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక, మానసిక వేధింపులకు గురైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇంతకాలం బయటకు చెప్పలేదని పేర్కొంది. దీంతో పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు. మిమి, వాధ్, మై లడేగా తదితర మూవీల్లో నటించిన అతడు ‘ధురంధర్’లో అక్షయ్ ఖన్నా వంటమనిషి అఖ్లాక్‌గా నటించారు.