News March 23, 2025

బ్లాక్‌లో SRH Vs RR మ్యాచ్ టికెట్లు.. 11మంది అరెస్ట్

image

ఇవాళ మధ్యాహ్నం జరగనున్న సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరంలో నలుగురు, మల్కాజిగిరిలో ముగ్గురు, ఎల్బీనగర్‌లో ముగ్గురు, భువనగిరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.

Similar News

News March 25, 2025

వాట్సాప్‌లో సూపర్ ఫీచర్

image

వాట్సాప్‌లో త్వరలో ‘Spotify Music-status updates’ ఫీచర్ రానుంది. దీని సాయంతో యూజర్లు Spotify మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ నుంచి తమకు ఇష్టమైన పాటలను వాట్సాప్ స్టేటస్‌లుగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇతర యూజర్లు కూడా ఆ స్టేటస్‌పై సింగల్ ట్యాప్‌తో Spotifyలో ఆ సాంగ్‌ను వినేందుకు వీలుంటుంది. యాప్‌లో స్టేటస్ ఆప్షన్ వద్దే నేరుగా మ్యూజిక్ యాడ్ చేసేలా ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.

News March 25, 2025

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్

image

AP: గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి ఆప్షన్ల మార్పునకు APPSC మరో అవకాశం కల్పించింది. ఈనెల 26 నుంచి ఏప్రిల్ 2 వరకు అభ్యర్థులు తమ మాధ్యమం, పోస్టులు, జోనల్ ప్రాధాన్యం, ఎగ్జామ్ సెంటర్ల మార్పు చేర్పులు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు మొత్తం 7 పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి.

News March 25, 2025

తెలంగాణ క్యాబినెట్‌లోకి నలుగురు కొత్త మంత్రులు!

image

క్యాబినెట్ విస్తరణపై నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే, మీనాక్షి, కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్, ఉత్తమ్, మహేశ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈక్రమంలో నలుగురికి కొత్తగా మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీల మేరకు మక్తల్ MLA శ్రీహరి ముదిరాజ్‌, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్, బోధన్ MLA సుదర్శన్ రెడ్డికి ‘అమాత్య’ యోగం కల్పించనున్నట్లు సమాచారం.

error: Content is protected !!