News April 12, 2025

ఇద్దరు బ్యాటర్లు చెలరేగినా SRHని ఆపడం కష్టం: వెటోరీ

image

దూకుడుగా ఆడితేనే SRH ఆటగాళ్ల అత్యుత్తమ ఆట బయటికొస్తుందని ఆ జట్టు కోచ్ వెటోరీ తెలిపారు. ‘మా బ్యాటర్లకు ఎలాంటి బంతులేయాలన్నదానిపై ఇతర జట్లు పూర్తి ప్లాన్‌తో వస్తున్నాయి. ఇద్దరు బ్యాటర్లు చెలరేగినా SRHను ఆపడం ఇక కష్టం. ఎవరో ఇద్దరు ఎదురు దాడి మొదలుపెడితే మిగిలినవారికీ ఆ దూకుడు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా ప్లేయర్స్ కమ్ బ్యాక్ ఇస్తారన్న నమ్మకం నాకుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News December 6, 2025

హిందీలో ‘పెద్ది’కి గట్టి పోటీ

image

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రం ‘పెద్ది’ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకి హిందీలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మార్చి 19న యశ్ ‘టాక్సిక్’తో పాటు అజయ్ దేవ్‌గణ్‌ ‘ధమాల్ 4’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటికి హిట్‌ టాక్‌ వస్తే ‘పెద్ది’ ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.

News December 6, 2025

విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం కఠిన చర్యలు

image

ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ఇతర విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్‌ ధరలు పెంచడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఛార్జీల క్రమబద్ధీకరణకు ఆదేశాలు జారీ చేసింది. సర్వీసులు రద్దైన అన్ని రూట్లలో కొత్తగా నిర్ణయించిన ధరలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని.. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని పేర్కొంది.

News December 6, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

image

AP: ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 2 నుంచి 13 వరకు 9AM నుంచి 12PM వరకు ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 11 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి 28 వరకు 9.30AM నుంచి 12.30PM వరకు జరుగుతాయి.
వెబ్‌సైట్: https://apopenschool.ap.gov.in/