News April 21, 2024

SRH.. ప్రపంచ రికార్డులు

image

నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో SRH పలు ప్రపంచ రికార్డులు సాధించింది. పవర్ ప్లేలో అత్యధిక బౌండరీలు(24), అత్యధిక సిక్సర్లు(11) కొట్టిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో 2014లో సస్సెక్స్‌పై శ్రీలంక కొట్టిన 20 బౌండరీల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అలాగే అత్యంత వేగంగా(8.4 ఓవర్లు) 150 రన్స్ చేసిన జట్టుగా, తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు(158) చేసిన టీమ్‌గా SRH ఘనత సాధించింది.

Similar News

News March 25, 2026

రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

image

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

News March 25, 2026

ఈసారి సిక్సర్ల వీరుడు ఎవరో?

image

ఈసారి IPLలో సిక్సర్ల వర్షం కురవడం ఖాయమని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. ముఖ్యంగా SRHలోని హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసెన్ విరుచుకుపడతారని తెలిపారు. వారితో పాటు శాంసన్ (CSK), అలెన్ (KKR), పూరన్ (LSG), రోహిత్ శర్మ (MI), శివమ్ దూబే (CSK), వైభవ్ సూర్యవంశీ (RR), బ్రెవిస్ (CSK) ఈ రేసులో ముందున్నారు. మరి ఈ సీజన్లో ఎవరు అత్యధిక సిక్సర్లు కొడతారో కామెంట్ చేయండి.

News March 25, 2026

ఇంధనం నిల్వ.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!

image

‘పానిక్ బయింగ్’ వల్లే అమ్మకాలు మూడింతలు పెరిగాయని TG పెట్రోలియం డీలర్ల సంఘం తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది. ‘‘ఇంధనం ఆవిరై గాలిలో కలిసినా లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ‘స్టాటిక్ ఎలక్ట్రిసిటీ’ ఉత్పన్నమైనా భారీ పేలుళ్లు సంభవించవచ్చు. పెట్రోల్ నుంచి వచ్చే వాసన పీల్చితే శ్వాసకోశ సమస్యలు, తల తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలొస్తాయి’’ అని నిపుణులు తెలిపారు.