News April 7, 2025

SRH ఘోర ఓటమి.. కారణాలివే!

image

బ్యాటర్లు పిచ్‌తో సంబంధం లేకుండా దూకుడునే నమ్ముకుని బోల్తా కొడుతున్నారు. గతంలో భువనేశ్వర్, నటరాజన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసేవారు. ఇప్పుడు షమీ తన స్థాయిలో రాణించట్లేదు. కమిన్స్ భారీగా పరుగులిస్తున్నారు. వికెట్ టేకింగ్ స్పిన్నర్లు లేరు. జంపా, రాహుల్ చాహర్ లాంటి మంచి స్పిన్నర్లు ఉన్నా జట్టులోకి తీసుకోకపోవడం దెబ్బ కొడుతోంది. ముఖ్యంగా 300 లోడింగ్ అనే అంచనాలు మొదటికే మోసం తెస్తున్నాయి.

Similar News

News April 9, 2025

పిడుగులు పడి 13మంది మృతి

image

బిహార్‌లో పిడుగుపాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో 13మంది మృతిచెందారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మధుబనీ జిల్లాలో పొలంలో పనిచేస్తున్న వారిపై పిడుగుపడటంతో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. మెుత్తంగా 4 జిల్లాల్లో పిడుగుల కారణంగా 13మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

News April 9, 2025

మోదీని విమర్శించే స్థాయి నీకుందా రేవంత్: TBJP

image

TG: ప్రధాని మోదీపై CM రేవంత్ చేసిన విమర్శలకు తెలంగాణ BJP కౌంటరిచ్చింది. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన నీకు మోదీని విమర్శించే స్థాయి ఉందా? రాహుల్ గాంధీకి ఊడిగం చేసే నువ్వా మాట్లాడేది? అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి పేద ప్రజల కడుపు కొడుతూ పబ్బం గడుపుకునే నువ్వా మాట్లాడేది? విదేశీ గడ్డపైనా ప్రశంసలు పొందిన మోదీని విమర్శించావంటే నీ స్థాయి ఏంటో, నీ కురచ బుద్ధి ఎలాంటిదో అర్థమవుతుంది’ అని ట్వీట్ చేసింది.

News April 9, 2025

రేపు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం

image

AP: ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ చీఫ్ జగన్ రేపు సమావేశం కానున్నారు. తాడేపల్లి కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నేతలతో భేటీ కానున్నట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మీటింగ్‌కు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, MLAలు, MLCలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని పేర్కొంది.

error: Content is protected !!