News March 23, 2025
SRHvsRR: జట్లు ఇవే

SRH: హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, అనికేత్, కమిన్స్, సిమర్జీత్, హర్షల్, షమీ
RR: జైస్వాల్, రాణా, జురెల్, పరాగ్, హెట్మెయిర్, శుభమ్ దూబే, జోఫ్రా, తీక్షణ, సందీప్, తుషార్ దేశ్పాండే, ఫరూఖీ
Similar News
News March 25, 2025
ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్నందుకే నాపై కేసులు: కాకాణి

AP: కూటమి ప్రభుత్వం తనపై కావాలనే అక్రమ కేసులు పెడుతుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఆరోపించారు. ‘గతంలో అక్రమాలు జరగలేదని మైనింగ్ అధికారి రిపోర్టు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అక్రమ మైనింగ్ అంటూ కేసు పెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే నాపై కేసులు పెడుతున్నారు. వాటికి భయపడేది లేదు. అక్రమ కేసులపై కోర్టులను ఆశ్రయిస్తా. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి’ అని ఆయన అన్నారు.
News March 25, 2025
హుస్సైనీ మృతిపై పవన్ స్పందన ఇదే..

AP: తన గురువు <<15878066>>షిహాన్ హుస్సైనీ<<>> మృతిపై Dy.CM పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘హుస్సైనీ తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. 4 రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి విదేశాల్లో మెరుగైన వైద్యం చేయిస్తానని తెలిపాను. ఈ నెల 29న వెళ్లి పరామర్శించాలనుకున్నాను. ఈలోపే ఇలా జరగడం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని పేర్కొన్నారు.
News March 25, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,290గా ఉంది. మరోవైపు హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.1,10,000గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది.