News April 1, 2024

భారత్ రికార్డును బ్రేక్ చేసిన శ్రీలంక

image

టెస్టుల్లో శ్రీలంక అరుదైన రికార్డు నెలకొల్పింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 531 పరుగులు చేసింది. ఇందులో ఆరుగురు ప్లేయర్లు అర్ధసెంచరీలు చేయగా.. ఏ ఒక్కరూ సెంచరీ చేయకపోవడం గమనార్హం. 1976లో న్యూజిలాండ్‌పై భారత్ ఇదే తరహాలో 524 పరుగులు చేసింది. తాజాగా శ్రీలంక ఆ రికార్డును అధిగమించి భారీ స్కోరు సాధించింది.

Similar News

News February 1, 2026

కేసీఆర్‌ను సిట్ అడిగిన ప్రశ్నలివే?

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCRను సిట్ కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ‘ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులను మీరే ఆదేశించారా? మీ పార్టీ MLAలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది? ఎప్పటి నుంచి ప్రైవేటు వ్యక్తుల ఫోన్ల ట్యాప్ జరిగింది? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని మీరే కోరారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. వీటికి KCR తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.

News February 1, 2026

8మంది MPలను ఇస్తే తిరిగిచ్చింది గుండు సున్నా: బడ్జెట్‌పై కవిత ఫైర్

image

TG: బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి ఎదురైందని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది BJP MPలను ఇస్తే బదులుగా గుండుసున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. ₹34,367 కోట్ల RRR, మెట్రో ఫేజ్-2 విస్తరణ నిధులు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను కేంద్రం విస్మరించిందన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, IIM వంటి కీలక డిమాండ్లను పట్టించుకోలేదన్నారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.

News February 1, 2026

ఫోన్ ట్యాపింగ్‌పై కఠినంగా వ్యవహరించాలి: కిషన్ రెడ్డి

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రెండేళ్లుగా సీరియల్ కింద సాగదీస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘జడ్జీలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులు కోర్టులో చెప్పారు. తన భర్త ఫోనూ ట్యాప్ చేశారని కవిత అన్నారు. ఈ కేసుపై కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వంలో మంత్రులు, కేసీఆర్ కుటుంబంలో సభ్యులు తమ వాటాల కోసం కొట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.