News October 9, 2025
AP,TN తీరాలకు శ్రీలంకే శ్రీరామ రక్ష

రాక్షస కెరటాల నుంచి AP,TN తీరాన్ని శ్రీలంక ద్వీపకల్పం రక్షణకవచంగా కాపాడుతున్నట్లు INCOIS అధ్యయనంలో తేలింది. దక్షిణ సముద్రం నుంచి తరచూ శక్తిమంతమైన అలలు ఆగ్నేయ దిశగా దూసుకొస్తుంటాయి. కేరళ తీరాన్ని తాకి తూర్పు వైపు వ్యాపిస్తుంటాయి. ‘వాచ్‌వేవ్స్-3’ విధానంలో శ్రీలంకను అడ్డుగా తీసేసి పరిశీలిస్తే ఇవి దక్షిణ తీరాన్నిఅత్యంత వేగంతో తాకాయి. అదే శ్రీలంక అడ్డుగా ఉండగా 96% అలలు పాండిచ్చేరిని చేరడం లేదు.
Similar News
News October 9, 2025
బేసిక్ పోలీసింగ్ మర్చిపోయారు: డీజీపీ

TG: రాష్ట్రంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో బేసిక్ పోలీసింగ్‌ను మర్చిపోయారని DGP శివధర్ వ్యాఖ్యానించారు. ‘ఇకపై రెండూ ఉండాలి. వాహనాల చెకింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌తో పాటు ఇంటెలిజెన్స్ సేకరణకు ప్రాధాన్యమివ్వాలి. కిందిస్థాయి నుంచే ఇంటెలిజెన్స్ సేకరించాలి. శాంతిభద్రతల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోలీసులకు పార్టీలతో సంబంధం లేదు. ప్రజల రక్షణే ధ్యేయం’ అని SPలు, కమిషనర్ల సమావేశంలో మాట్లాడారు.
News October 9, 2025
TTDకి టోకరా వేయబోయి… చివరకు CBIకి చిక్కి

PMO Dy.Sec అంటూ మోసాలు చేస్తున్న వ్యక్తి తిరుమల బాలాజీ సాక్షిగా దొరికాడు. మే10న రామారావు అనే వ్యక్తి PMO అధికారినని 10 సుప్రభాత టికెట్లు, 3AC రూములు కావాలని TTD EOకు లేఖ ఇచ్చారు. అనుమానంతో అధికారులు PMOలో ఆరా తీయగా అలాంటి వ్యక్తి లేరని చెప్పారు. ఆపై PMO AD శర్మ CBIకి ఫిర్యాదు చేశారు. తాజాగా కేసు విచారణలో అతడు ఇదివరకూ పీఎంఓ JSనంటూ పుణే వర్సిటీలో అడ్మిషన్, మైసూరులో భూమి పత్రాలను పొందాడని తేలింది.
News October 9, 2025
బీఆర్ఎస్ చేసిన చట్టం బీసీలకు ఉరితాడులా మారింది: భట్టి

TG: రాష్ట్రంలో రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా 2018లో BRS చేసిన చట్టం ఇప్పుడు OBCలకు ఉరితాడులా మారిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు అడ్డుకుంటారనే పక్కాగా కులగణన సర్వే చేశామన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. కానీ కోర్టులో కేసులు వేసి బీసీల నోటి కాడ ముద్దను లాక్కుంటున్నారు’ అని ఆరోపించారు.