News November 13, 2024
నేడు శ్రీలంకvsన్యూజిలాండ్ తొలి వన్డే

శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఈరోజు జరగనుంది. డంబుల్లా వేదికగా మధ్యాహ్నం 2.30గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమమైంది. కాగా స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌నైనా గెలవాలని శ్రీలంక భావిస్తోంది. అటు లంకేయుల చేతిలో ఇటీవల టెస్టుల్లో ఎదురైన పరాభవానికి బదులుగా ఈ సిరీస్ గెలవాలని కివీస్ భావిస్తోంది.
Similar News
News March 25, 2026
RCB పేరు మార్పు.. క్లారిటీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త ఓనర్లు రావడంతో టీమ్ పేరు మారుస్తారనే చర్చ నడుస్తోంది. దీనిపై యజమానుల్లో ఒకరైన అనన్య బిర్లా క్లారిటీ ఇచ్చారు. RCB పేరులో ఎలాంటి మార్పు ఉండదని, ఇకపైనా అదే నేమ్‌తో కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు. కాగా ఆదిత్య బిర్లా, డేవిడ్ బ్లెజర్, బ్లాక్‌స్టోన్ కన్సార్షియం RCBని ఈ నెల 31లోపు టేకోవర్ చేసుకోనుంది. ఇక 28న IPL-2026 తొలి మ్యాచులో ఆ జట్టు SRHతో తలపడనుంది.
News March 25, 2026
సిఫార్సు.. ఇన్‌స్టాగ్రామ్‌కూ e-KYC

దేశంలో ఇన్‌స్టాగ్రామ్‌కు e-KYC తప్పనిసరి చేయాలని కేంద్ర హోం, ఐటీ మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. SMలో ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా మోసాలు, వేధింపులను అరికట్టేందుకు ఈ విధానం తీసుకురావాలని సూచించింది. తద్వారా మహిళలు, మైనర్లకు డిజిటల్ మాధ్యమాలను మరింత సురక్షితంగా మార్చవచ్చని అభిప్రాయపడింది. అయితే దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ విధానంపై మీరేమంటారు.
News March 25, 2026
ట్రోలింగ్‌ను పట్టించుకోను: హరీశ్ శంకర్

తనపై SMలో జరుగుతున్న ట్రోలింగ్‌పై డైరెక్టర్ హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘ట్రోల్ చేసేవారు ఎవరో, ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్లకు కనీసం తమ గుర్తింపును బయటపెట్టే ధైర్యం కూడా లేదు. అలాంటి వారిని నేను అస్సలు పట్టించుకోను. అలా అయితే ఎప్పుడో SMను వీడేవాడిని’ అని హరీశ్ స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను సకాలంలో థియేటర్లలోకి తీసుకురావడమే తన అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు.


