News June 14, 2024
గ్రూప్ స్టేజీలోనే ఇంటిదారి పట్టిన లంక

మాజీ ఛాంపియన్ శ్రీలంక టీ20 ప్రపంచకప్-2024 నుంచి ఎలిమినేట్ అయింది. సౌతాఫ్రికా, బంగ్లాతో ఓటములు, నేపాల్‌తో మ్యాచ్ రద్దుతో గ్రూప్ స్టేజీలోనే ఇంటిదారి పట్టింది. ఈ టోర్నమెంటులో 3 మ్యాచులు ఆడిన హసరంగా సేన.. కేవలం ఒకే పాయింట్ సాధించింది. గ్రూప్-D నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సూపర్-8కి చేరింది. ఆ గ్రూపులోని నెదర్లాండ్స్, నేపాల్‌లతో పోలిస్తే సూపర్-8కు వెళ్లేందుకు బంగ్లాకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Similar News
News September 13, 2025
భీమిలి: బాలికపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

భీమిలి ప్రాంతంలో 8 నెలల క్రితం వికలాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి పోక్సోచట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భీమిలి ప్రాంతంలో అమ్మమ్మ దగ్గర ఉన్న మైనర్‌ను బోరా ఎల్లారావు అత్యాచారం చేశాడు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.
News September 13, 2025
రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం!

నైరుతి రుతుపవనాల తిరోగమనం సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని IMD అంచనా వేసింది. జూన్ 1న కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 8వ తేదీకల్లా అంతటికీ విస్తరించాయి. ఈ సీజన్లో 77.86CM వర్షం కురవాల్సి ఉండగా 83.62CM వర్షపాతం నమోదైంది. వాయవ్య భారతంలో సాధారణం(53.81CM) కంటే 34 శాతం, దక్షిణాదిన రెగ్యులర్(61CM) కంటే 7 శాతం అధిక వర్షపాతం నమోదైందని IMD వెల్లడించింది.
News September 13, 2025
ట్రెండింగ్.. బాయ్‌కాట్ ఆసియా కప్

ఆసియా కప్‌లో రేపు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ‘బాయ్‌కాట్ ఆసియా కప్, బాయ్‌కాట్ INDvsPAK’ అనే హ్యాష్ ట్యాగ్లు Xలో ట్రెండ్ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తామింకా మరిచిపోలేదని, PAKతో క్రికెట్ ఆడొద్దని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచును BCCI బ్యాన్ చేయకపోయినా దేశ ప్రజలు బ్యాన్ చేయాలంటూ SMలో పోస్టులు పెడుతున్నారు. రేపు మీరు మ్యాచ్ చూస్తారా? కామెంట్ చేయండి.