News February 4, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్

శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే(36) ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈనెల 6 నుంచి AUSతో జరిగే రెండో టెస్ట్ మ్యాచే తనకు చివరిదని తెలిపారు. SL తరఫున 99 టెస్టుల్లో 7,172 పరుగులు, 50 ODIల్లో 1,316 రన్స్ చేశారు. టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించారు. 30 టెస్టులకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఇటీవల ఫామ్ కోల్పోవడంతో రిటైర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు.
Similar News
News March 30, 2026
75 ఏళ్ల వయసులో మహిళల విడాకులు.. భర్తల వయసు ఎంతంటే?

సిమ్లా(HP)లో ఇద్దరు 75 ఏళ్ల మహిళలు భర్తలకు విడాకులు ఇచ్చారు. రెండు ఘటనల్లోనూ భార్యల కంటే భర్తల వయసు(59, 39 ఏళ్లు) తక్కువ ఉండటం గమనార్హం. అలాగే పరస్పర అంగీకారంతోనే డివోర్స్ తీసుకున్నారు. మొదటి కేసులోని జంట 1990లో పెళ్లాడగా 2010 నుంచి దూరంగా ఉంటోంది. రెండో కేసులో జంట 2008లో వివాహం చేసుకోగా 2021 నుంచి విభేదాలు మొదలయ్యాయి. సయోధ్యకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సమ్మతితో విడిపోయారు.
News March 30, 2026
రిటైర్మెంట్, పెన్షన్లను Gen Z నమ్మట్లే!

ఆర్థిక సవాళ్ల కారణంగా Gen Z(1997-2012) రిటైర్మెంట్‌ను ఒక ఆప్షన్‌గానూ భావించట్లేదు. పెన్షన్లపై నమ్మకం లేదని, జీవితాంతం పనిచేస్తూనే ఉండాల్సి వస్తుందని 12శాతం మంది యువత భావిస్తోంది. ఆర్థిక విషయాలపై అవగాహన లేకపోవడం, పెరుగుతున్న ఖర్చులే ఇందుకు కారణం. అయితే చిన్న వయసు నుంచే పొదుపు చేస్తే భారీ లాభం ఉంటుందని, నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక ఇబ్బందులొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News March 30, 2026
బంగ్లాదేశ్‌లో IPL టెలికాస్ట్ లేనట్లే

బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచుల ప్రసారం జరిగే అవకాశం లేదు. ఇటీవల ఆ దేశ ప్రభుత్వం మ్యాచుల ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ బ్రాడ్‌కాస్ట్ అగ్రిమెంట్‌ను జియో స్టార్ తాజాగా రద్దు చేసుకుంది. 2023-2027 వరకు ప్రసార హక్కులను తీసుకున్న బంగ్లా ఛానల్ ‘టీ స్పోర్ట్స్’ గడువులోగా పేమెంట్స్ చేయలేదు. దీంతో జియో స్టార్ ఒప్పందాన్ని రద్దు చేసింది. WPLకూ ఇది వర్తించనుంది.


