News January 26, 2025
ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్-2024గా శ్రీలంక ప్లేయర్

మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024గా శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్‌ను ICC ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది మెండిస్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. 50కి పైగా సగటుతో అన్ని ఫార్మాట్లలో 1,451 పరుగులు చేశారు. ఇందులో 9 టెస్టుల్లో 74.92 యావరేజీతో 1,049 పరుగులు చేయడం గమనార్హం.
Similar News
News January 10, 2026
కాలుష్యంలో ఢిల్లీని దాటేసిన బర్నీహాట్

దేశంలో కాలుష్యానికి రాజధాని ఢిల్లీనే అనుకుంటే ఈసారి అస్సాంలోని బర్నీహాట్ పట్టణం అంతకు మించిపోయింది. ఢిల్లీని వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది. సీఆర్ఈఏ (Centre for Research on Energy and Clean Air) తాజా నివేదిక ప్రకారం పీఎం2.5, పీఎం10 స్థాయులు ఆందోళనకరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 44% నగరాలు వాయు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. UPలో అత్యధికంగా 416 నగరాలు ఈ జాబితాలో నిలిచాయి.
News January 10, 2026
బొంత ఊద.. వరి లాంటి కలుపు మొక్క

వరి చేనులో బొంత ఊద కలుపు మొక్కలు కలవరపెడుతున్నాయి. ఇవి కూడా వరి మాదిరిగానే పెరుగుతాయి. పూర్తిగా పెరిగే వరకు వీటిని గుర్తుపట్టలేము. అందుకే దీన్ని దొంగ వరి అంటారు. పంటకు అందించే పోషకాలను ఇవి గ్రహించి వరి కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కల వల్ల వరిలో పొడ తెగులు, సుడిదోమ ఉద్ధృతి పెరుగుతుందని రైతులు అంటున్నారు. వరిలో ఇలాంటి కలుపును గుర్తిస్తే నిపుణుల సూచనల మేరకు మందులు వాడి నిర్మూలించండి.
News January 10, 2026
హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్‌షిప్

<


