News March 20, 2024
హసరంగ కోసం శ్రీలంక మాస్టర్ ప్లాన్..?

అంపైర్లతో దురుసు ప్రవర్తన కారణంగా శ్రీలంక స్పిన్నర్ హసరంగపై ఐసీసీ రెండు మ్యాచుల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాతో వన్డే సిరీస్ అనంతరం అతడు ఆడే 2 టెస్టులు లేదా 4 వన్డేలు/టీ20 మ్యాచులపై నిషేధం అమలవ్వాల్సి ఉంది. బంగ్లాతో టెస్టుల తర్వాత శ్రీలంక ఆడేది టీ20 వరల్డ్ కప్లోనే. దీంతో ఆ సమయంలో బ్యాన్ అవకుండా.. శ్రీలంక బోర్డు తెలివిగా టెస్టులకు అతడిని ఎంపిక చేసిందన్న వాదన నెట్టింట వినిపిస్తోంది.
Similar News
News November 23, 2025
భారత్vsదక్షిణాఫ్రికా.. రెండో రోజు ముగిసిన ఆట

గువాహటిలో దక్షిణాఫ్రికా, టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్సులో వికెట్లేమీ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా 489 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా పంత్ సేన 480 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో జైస్వాల్(7), రాహుల్(2) ఉన్నారు. రేపు దూకుడుగా ఆడి లీడ్ దిశగా సాగితేనే మ్యాచ్పై పట్టు బిగించే అవకాశం ఉంది.
News November 23, 2025
వివిధ పండ్ల తోటలు – పిందె రాలడానికి కారణాలు

☛ మామిడి -పుష్పాలలో పరాగ సంపర్క లోపం, పుష్ప దశలో వర్షం, హార్మోన్ల అసమతుల్యత, రసం పీల్చే పురుగుల దాడి
☛ నిమ్మ, బత్తాయి – అధిక వర్షాలు, అధిక ఎరువుల వాడకం, పాము పొడ పురుగు
☛ ద్రాక్ష – అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, అధిక తేమ, బూడిద, ఆంత్రాక్నోస్ తెగులు
☛ బొప్పాయి – పరాగసంపర్కం లోపం, బోరాన్ లోపం, అధిక వర్షం లేదా నీరు నిల్వ ఉండిపోవడం, బూడిద తెగులు పుష్పాలపై రావడం వల్ల పిందెలు రాలిపోతాయి.
News November 23, 2025
ఆన్లైన్లో సర్వపిండి, సకినాలు!

TG: సర్వపిండి, సకినాలు, కజ్జికాయలు, గవ్వలు వంటి పిండివంటలకు బ్రాండింగ్ కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్(D)లోని మహిళా సంఘాలకు వీటి తయారీ, ఆకర్షణీయ ప్యాకింగ్, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం వీరు FSSAI ధ్రువీకరణతో విక్రయాలు చేస్తున్నారు. ఈ పిండివంటల అమ్మకాలు పెంచేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.


