News April 11, 2025
శ్రీధర్ బాబు సీఎం పదవికి అర్హుడే.. కానీ: అర్వింద్

TG: సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్ బాబుకు సీఎం అయ్యే అర్హత ఉందన్నారు. కానీ ఆయనకు వసూలు చేయడం రాదని, అందుకే హైకమాండ్ వెనక్కి తగ్గుతోందని అర్వింద్ ఎద్దేవా చేశారు.
Similar News
News March 26, 2026
NTR భరోసా పింఛన్లకు రూ.2,707.74 కోట్లు విడుదల

ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ఏప్రిల్ నెలకు రూ. 2,707.74 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 62,18,715 మందికి వివిధ బ్యాంకుల్లో జమ అయిన ఈ నిధులు ఈ నెల 31న డ్రా చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు రూ.130.51 కోట్లు కేటాయించగా నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు రూ.19.67 కోట్లు అత్యల్పంగా విడుదలయ్యాయి.
News March 26, 2026
యుద్ధం.. భారత్‌పై ఇరాన్ ఒత్తిడి!

యుద్ధం వల్ల దౌత్యపరంగా భారత్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. US, ఇజ్రాయెల్ దాడులను BRICS కూటమి ఖండించేలా చర్యలు తీసుకోవాలని భారత్‌ను ఇరాన్ కోరినట్లు సమాచారం. అయితే కూటమిలో ఇరాన్ ప్రత్యర్థులైన సౌదీ – UAE ఉండటం, అమెరికా-ఇజ్రాయెల్ కూడా మిత్రపక్షాలే కావడం భారత్‌కు సవాల్‌గా మారింది. దీంతో ఈ ఏడాది BRICSకు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.
News March 26, 2026
మార్కాపురం ప్రమాదం.. మొండి కత్తితో 8 మందిని కాపాడాడు

AP: మార్కాపురం <<19479058>>బస్సు ప్రమాద ఘటన<<>>లో ఓ వ్యక్తి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడారు. బస్సులో మంటలు చెలరేగగానే అక్కడే ఉన్న మొండికత్తితో అద్దాలు పగలగొట్టి ఎనిమిది మందిని బయటకు తోసేశారు. తర్వాత తాను కూడా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పొగ దట్టంగా వ్యాపించడంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయానని ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.


