News December 8, 2024
టీఫైబర్ సేవలు ప్రారంభించిన శ్రీధర్ బాబు

TG: టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా 20Mbps వేగంతో నెలకు రూ.300కే ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించనున్నారు. మొబైల్, కంప్యూటర్, టీవీకి వినియోగించవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దీంతో పాటు మీసేవ మొబైల్ యాప్‌ను మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా 150కి పైగా పౌర సేవలు అందించనున్నారు.
Similar News
News January 6, 2026
ఒమన్‌లో పెళ్లికి ముందు హెల్త్ చెకప్ తప్పనిసరి!

ఒమన్‌లో ఇకపై పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చింది. జంటలో ఒకరు విదేశీయులైనా ఈ టెస్టులు కంపల్సరీ. జన్యుపరమైన వ్యాధులను గుర్తించడం, హెపటైటిస్, HIV వంటి వైరస్లు ఒకరి నుంచి మరొకరికి లేదా పుట్టబోయే బిడ్డకు సోకకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. రిజల్ట్స్‌ను మూడో వ్యక్తికి చెప్పొద్దనే నియమం పెట్టారు.
News January 6, 2026
కుజ దోష నివారణకు శుభప్రదం ‘మంగళ వారం’

జాతకంలో కుజ దోషంతో సమస్యలు ఎదుర్కొనే వారు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేయడం విశేష ఫలితాలుంటాయి. కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుడిని ఆరాధిస్తే దోష తీవ్రత తగ్గుతుంది. ఎరుపు దుస్తులు ధరించి పూజ చేయాలి. కందులు దానం చేయడం, కుజ అష్టోత్తరం పఠించడం వల్ల జాతకంలోని ప్రతికూలతలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయి. భక్తితో చేసే ఈ పరిహారాలు మానసిక ధైర్యాన్ని ఇచ్చి కార్యసిద్ధికి మార్గం చూపుతాయి.
News January 6, 2026
ఇంటర్వ్యూతో ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

ఏపీ: మంగళగిరిలోని <


