News March 17, 2024

శ్రీకాకుళం: జాతీయ లోక్ అదాలత్‌లో 1782 కేసులు పరిష్కారం

image

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, ఇచ్చాపురం కోటబొమ్మాలి, నరసన్నపేట పాలకొండ, పలాస, పాతపట్నం రాజాం, సోంపేట, టెక్కలి, కొత్తూరు పొందూరు కోర్టులలో జరిగిన జాతీయ లోక్‌ అదాలత్ మొత్తం 1782 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేసినందుకు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Similar News

News October 15, 2025

‘విశాఖ ఎకనామిక్ జోన్’ కేంద్ర బిందువుగా భోగాపురం

image

‘విశాఖ ఎకనామిక్ జోన్’ కేంద్ర బిందువుగా భోగాపురం మారనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం గుర్తించబోయే 20 వేల ఎకరాల భూమిలో, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 30-40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, గాజువాక మండలాలతో పాటు భోగాపురం పరిసర ప్రాంతాల్లో భూమి గుర్తింపు ప్రక్రియ వేగవంతమవుతోంది.

News October 15, 2025

కలెక్టరేట్ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన కలెక్టరేట్‌ను పరిశీలించారు. ప్రజల పరిపాలనకు ఉపయోగపడే గదులన్నీ కింద ఫ్లోర్‌లో ఉండేలా, ఒక్కో శాఖకు కేటాయించే స్క్వేర్ ఫీట్‌ను నిర్ణయించి, గదులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

News October 15, 2025

కళింగపట్నం బీచ్‌లో ఆకట్టుకున్న GST సైకత శిల్పం

image

సిక్కోలు జిల్లా కళింగపట్నం బీచ్‌లో ఏర్పాటు చేసిన జీఎస్టీ (GST) అంశంపై సైకత శిల్పం సందర్శకులను ఆకట్టుకుంటోంది. స్థానిక కళాకారుడు ఇసుకతో తీర్చిదిద్దిన ఈ శిల్పం, ప్రజల్లో పన్నుల వ్యవస్థపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు ఈ శిల్పం వద్ద ఫోటోలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు.