News March 17, 2024
శ్రీకాకుళం: ప్రశాంతంగా గ్రూప్-1 పరీక్షలు
శ్రీకాకుళం జిల్లాలో గ్రూప్-1 పరీక్షలు సజావుగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పేపర్ -1 కు సంబంధించి మొత్తం 6,403 మందికి గానూ పరీక్షలకు 4,124 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. 2,279 మంది పరీక్షలకు హాజరుకానట్లు వెల్లడించారు. పేపర్-2కు సంబంధించి 6,403 మందికి 4088 మంది హాజరయ్యారు. 2,315 మంది పరీక్షలకు హాజరు కాలేదు.
Similar News
News October 31, 2024
జలుమూరు: చెన్నైలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
జలుమూరు మండలం లింగన్నాయుడుపేట గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ చెన్నైలో మృతి చెందిన ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు మంగళవారం చెన్నైలో విధులు నిర్వహిస్తున్న కోర్ను గోవిందరావు(39) అనారోగ్యంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానిక సిబ్బంది అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందారు. బుధవారం ఆయన మృతదేహాన్ని స్థానిక గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
News October 30, 2024
ఎచ్చెర్ల. డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను నేడు విడుదల చేశారు. ఈ పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుం లేకుండా నవంబరు 11వ తేదీ వరకు చెల్లించవచ్చని యూనివర్సిటీ డీన్ తెలిపారు. అదేవిధంగా తెలిపారు. సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు నవంబర్ 18 నుంచి 23వ నుంచి వరకు, సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 28 నుంచి జరుగుతాయని నుంచి తెలిపారు.
News October 30, 2024
టెక్కలిలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
టెక్కలి సబ్ కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉంటున్న సంపతిరావు దివ్య(28) అనే వివాహిత బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ఆమె కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతుంది. భర్త శ్రావణ్ కుమార్ టెక్కలి తహశీల్దార్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై ఎస్సై రాము కేసు నమోదు చేశారు.