News March 18, 2024

శ్రీకాకుళం: పోలీసు స్పందన కార్యక్రమం రద్దు

image

సార్వత్రిక ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమలులో ఉన్నందున, శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన పోలీసు స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక సోమవారం తెలియజేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం స్పందన కార్యక్రమం నిర్వహించబడదని ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News January 27, 2026

పోలమాంబ సిరిమాను సంబరం నేడే..!

image

మక్కువ(M) శంబర శ్రీ పోలమాంబ తల్లి సిరిమానోత్సవానికి అధికారులు అన్నీ సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానుందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. తొలుత పూజారిని చదురు గుడి నుంచి భుజాలపై మోసుకొని మంగళవాయిద్యాల నడుమ వెళ్లి సిరిమాను అధిరోహిస్తారు. భక్తులు అరటి పండ్లు, చీరలు, కొబ్బరి కాయలతో మొక్కులు చెల్లిస్తారు.

News January 27, 2026

ఇత్తడితో శ్రీముఖలింగం ఆలయ నమూన

image

సారవకొట మండలం బుడితి గ్రామంలో కంచు, ఇత్తడి పరిశ్రమ ఉన్న విషయం తెలిసిందే. ఇందులో పనిచేస్తున్న కార్మికుడు జనార్ధన రావు సూమారు అరకేజి ఇత్తడి‌తో శ్రీముఖలింగం ఆలయ నమూనను తయారు చేశారు. ఇటీవల వీరికి లేపాక్షి వారు అందించిన శిక్షణతో దీన్ని రూపొందించారు. వచ్చే నెల మహా శివరాత్రి పురస్కరించుకొని ఈ కళాఖాండాన్ని తయారు చేసినట్లు ఆయన సోమవారం తెలిపారు. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే పలువురికి ఉపాధి లభిస్తుంది.