News March 18, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు

image

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా.. పాఠశాలల్లో నేటినుంచి ఒంటి పూట నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే వెంకటేశ్వరరావు ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని స్పష్టం చేశారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు.

Similar News

News April 6, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్..!

image

శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమ, మంగళవారాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పడేటప్పుడు ప్రజలు బయట తిరగకూడదని సూచించారు.

News April 6, 2026

SKLM: 11 మంది పిల్లలపై పిచ్చి కుక్క దాడి

image

పొందూరులో పిచ్చికుక్క రెండు రోజుల్లో వీరంగం సృష్టించింది. మండల కేంద్రంలోని నాయుడువీధి, గాంధీనగర్, మార్కెట్ లైన్, కనకాల వీధిలలో 15 ఏళ్ల లోపు 11 మంది పిల్లలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితులను శ్రీకాకుళం RIMSకు తరలించారు. మిగతా వారికి పొందూరు సామాజిక హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజులు కోరుతున్నారు.

News April 6, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

image

శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమవారం, మంగళవార లలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు బయట తిరగకూడదని సూచించారు.