News March 18, 2024

శ్రీకాకుళం: బార్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి భాయి

image

హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆమదాలవలస బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా కనితి విజయలక్ష్మి భాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి సాధు ధనుంజయరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికైన తొలి మహిళ అధ్యక్షురాలుగా ఆమె రికార్డు సృష్టించారు. ఉపాధ్యక్షులుగా రమణమూర్తి, కార్యదర్శిగా ఎ.విజయ్ కుమార్, సహాయ కార్యదర్శిగా బీ.మోహన్‌రావు ఎన్నికైనట్లు ప్రకటించారు.

Similar News

News April 4, 2025

ఎచ్చెర్ల: 7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు

image

Dr.BR.అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అఫిలియేషన్ డిగ్రీ కళాశాలల 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు యూజీ ఎగ్జామినేషన్స్ డీన్ పి.పద్మారావు వివరాలు వెల్లడించారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. 54 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రెగ్యులర్, సప్లిమెంటరీ విధానంలో 9,000 మంది వరకు పరీక్షలకు హాజరు కానున్నారు.

News April 4, 2025

నరసన్నపేట: లారీ యాక్సిడెంట్.. తాపీమేస్త్రి మృతి

image

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ తాపీమేస్త్రి మృతి చెందారు. నరసన్నపేట మండలం పొలాకి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు(49) మధురవాడలో మరో వ్యక్తితో పని నిమిత్తం బైక్‌పై బయలుదేరారు. మారికవలస హైవేపై ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న ప్రభాకర్ రావు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

News April 4, 2025

శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన డీఎంఅండ్‌హెచ్ఓ

image

శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంపై గురువారం ఏసీబీ ఆకస్మికంగా దాడులు చేశారు. డీఎం‌అండ్‌హెచ్‌ఓ బాలమురళీకృష్ణ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ బీవీవీ రమణమూర్తి గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ మెడికల్ లీవ్‌‌లో ఉంది. ఆమె తిరిగి విధుల్లో చేరేందుకు లంచం అడగడంతో ఏసీబీని ఆమె ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!