News September 27, 2025

శ్రీలలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ

image

దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమివ్వనున్నారు. మరోవైపు వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారు భువనేశ్వరీ అలంకారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. అటు శ్రీశైలం భ్రమరాంభిక దేవి కాత్యాయనీ అలంకారంలో కనిపించనున్నారు. ఇక తిరుమలలో ఉ.8-10 గంటల వరకు శ్రీవారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేటూన్యూస్‌లో లైవ్ చూడవచ్చు.

Similar News

News February 17, 2026

నేటితో శుక్ర మౌఢ్యమి ముగింపు

image

గతేడాది నవంబర్ 26వ తేదీన మొదలైన శుక్ర మౌఢ్యమి నేటితో ముగియనుంది. ఇన్నాళ్లూ అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు రేపటి నుంచి తిరిగి శుభప్రదమైన స్థితిలోకి వస్తాడు. దీంతో నిలిచిపోయిన శుభ కార్యాలు రేపటి నుంచి మళ్లీ మొదలవుతాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి విలువైన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా, నిశ్చింతగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

News February 17, 2026

బిల్ గేట్స్ టూర్.. SMలో తీవ్ర విమర్శలు!

image

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నిన్న <<19155078>>అమరావతి<<>>లో పర్యటించడం తెలిసిందే. అయితే ఆయన భారత టూర్‌పై SMలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ పేరు చాలా సార్లు ఉండటమే ఇందుకు కారణం. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న అలాంటి వ్యక్తితో ఎవరూ భేటీ కాకూడదని MP కాంగ్రెస్ నేత అనూప్ ధోటే ట్వీట్ చేశారు. తన ఉత్పత్తుల కోసం ఇండియాను ల్యాబ్‌లా ఆయన చూస్తారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

News February 17, 2026

లెజెండరీ నటుడు కన్నుమూత!

image

హాలీవుడ్ లెజెండరీ నటుడు రాబర్ట్ డువల్(95) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన 60 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 100 చిత్రాల్లో ఆయన నటించారు. హాలీవుడ్ గ్రేట్ మూవీస్ ‘ది గాడ్ ఫాదర్‌’, ‘ది గాడ్ ఫాదర్‌-2’లో కనిపించారు. టెండర్ మెర్సీస్ సినిమాకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. మరో 6 సార్లు నామినేట్ అయ్యారు.