News November 2, 2024
‘పుష్ప2’లో శ్రీలీల ఐటమ్ సాంగ్?

‘పుష్ప-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఐటమ్ సాంగ్‌లో శ్రీలీల స్టెప్పులేయనున్నట్లు టాక్. దీని కోసం తొలుత బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ని సంప్రదించగా అది వర్కౌట్ కాలేదని, షూట్ దగ్గర పడుతుండటంతో శ్రీలీలను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సాంగ్‌లో శ్రీలీలతో పాటు సమంత కూడా పుష్పరాజ్‌తో కలిసి సందడి చేయనున్నట్లు సమాచారం.
Similar News
News December 3, 2025
NZB: రూ.17 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

NZB పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్‌కు సంబంధించి 170 మంది బాధితులు ఫోన్లు పోగొట్టుకున్నరు. రూ.17 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు ACP రాజా వెంకటరెడ్డి అందజేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
News December 3, 2025
రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.
News December 3, 2025
భారీ ఎన్కౌంటర్.. 15 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.


