News October 15, 2024

రేపు శ్రీశైలం గేట్లు ఓపెన్

image

కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద, ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. దీంతో రేపు ఉదయం 7 గంటలకు డ్యాం గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది 5వ సారి గేట్లు ఎత్తనున్నారు. ప్రస్తుతం 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న నీటితో ఔట్‌ఫ్లో 66,067 క్యూసెక్కులుగా ఉంది.

Similar News

News November 18, 2025

ప్రీ మెచ్యూర్ బేబీల సంరక్షణ ఇలా..

image

ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం చాలా ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్‌, నెబ్యులైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

NABFINSలో ఉద్యోగాలు

image

<>NABARD <<>>ఫైనాన్షియల్ సర్వీసెస్ (NABFINS)21 రీజియన్లలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. ఇంగ్లిష్, లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం, రాయడం, మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వెబ్‌సైట్: https://nabfins.org/