News October 24, 2025
మార్కాపురంలోకి శ్రీశైలం?.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు

AP: ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో శ్రీశైలాన్ని కలిపేలా అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. నంద్యాల(D) కేంద్రానికి శ్రీశైలం దూరంగా ఉండటంతో స్థానికుల నుంచి వినతులు వచ్చినట్లు సమాచారం. మార్కాపురానికి శ్రీశైలం 80 కి.మీ. దూరంలో ఉండగా, నంద్యాల-శ్రీశైలం మధ్య 165 కి.మీ దూరం ఉంది. మరోవైపు అద్దంకిని బాపట్ల(D) నుంచి తిరిగి ప్రకాశం(D)లో విలీనం చేసే ప్రతిపాదనలూ ఉన్నట్లు సమాచారం.
Similar News
News February 13, 2026
మున్సిపోల్స్: కరీంనగర్‌లో బీజేపీలోకి ఇద్దరి చేరిక

TG: కరీంనగర్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 13వ డివిజన్‌లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి తెల్ల లక్ష్మి, 15వ డివిజన్‌లో విజయం సాధించిన ఏఐఎఫ్‌బీ అభ్యర్థి విపల సాయి జ్యోతి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 సీట్లు ఉండగా బీజేపీ 30 సీట్లు గెలిచింది. తాజాగా ఇద్దరి చేరికతో ఆ పార్టీ బలం 32కి చేరింది.
News February 13, 2026
T20WC: నెదర్లాండ్స్ ఘోర ఓటమి

చెన్నై వేదికగా USAతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఘోరంగా ఓడింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 15.5 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. బాస్ డీ లీడే(23) టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో భారీ ఓటమి తప్పలేదు. హర్మీత్ సింగ్ 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశారు.
News February 13, 2026
వాలంటైన్స్ డే.. ఆ లింక్‌లపై క్లిక్ చేయొద్దు!

TG: వాలంటైన్స్ డే సందర్భంగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. నకిలీ డేటింగ్ ప్రొఫైళ్లు, గిఫ్ట్ ఆఫర్లు, పూల డెలివరీ, డిస్కౌంట్‌ల పేరిట లింక్‌లు వస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వాటిపై క్లిక్ చేస్తే నకిలీ పేమెంట్ వెబ్ సైట్లు, యాప్స్ డౌన్‌లోడ్ అయి డబ్బు మాయమవుతాయని తెలిపారు. అటు OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొన్నారు.


