News November 18, 2024

శ్రీవాణి ట్రస్ట్ అంటే..

image

శ్రీవాణి ట్రస్టు(శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్) పేరు రద్దు వేళ సర్వత్రా చర్చ జరుగుతోంది. ట్రస్టుకు ₹10వేలు విరాళమిస్తే తొలి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ప్రతి నెలా 23న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. విరాళమిచ్చిన ఏడాదిలో(రూమ్, VIP టికెట్‌ ₹11,500) 12ఏళ్ల లోపు పిల్లలను తీసుకెళ్లొచ్చు. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ట్రస్టును రద్దు చేసి, TTD ఖాతా ద్వారా లావాదేవీలు జరపనున్నారు.

Similar News

News November 23, 2025

NRPT: భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడి మశ్చీందర్ బాగ్లి మృతి

image

నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడు మశ్చీందర్ బాగ్లి శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణ మండలం హిందూపూర్‌కి చెందిన మశ్చీందర్ భూ నిర్వాసితుల పక్షాన నిలబడి అనతి కాలంలోనే ఓ నాయకుడి ఎదిగారు. 60 రోజుల పాటు భూ నిర్వాసితుల సమస్యలపై వివిధ పార్టీలతో కలిసి సమిష్టిగా పోరాటం చేశారు. ఆయన మరణం జిల్లాలో నిరాశను నింపింది. పలువురు నాయకులు, రైతులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

News November 23, 2025

బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>జేసీ<<>> బోస్ ఇన్‌స్టిట్యూట్‌ 13 డఫ్ట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jcbose.ac.in/

News November 23, 2025

శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

image

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>